Header Banner

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు నాలుగు రాళ్ళు వెనకేసినట్టే!

  Fri May 09, 2025 10:45        Health

మానవ శరీరంలో మూత్రపిండాలు ముఖ్యమైన అవయవం. ఇవి రక్తాన్ని వడపోసి వ్యర్ధాలను మన శరీరం నుండి బయటకు పంపిస్తాయి. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపటంలో మూత్రపిండాల పాత్ర కీలకమైనది. అటువంటి మూత్రపిండాలను ఆరోగ్యంగా చూసుకోవలసిన అవసరం ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో చాలామంది మూత్రపిండాలలో రాళ్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. 

 

మూత్రపిండాలలో రాళ్లు వస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎవరికైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో వారు మూత్రపిండాల విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. మూత్రపిండాలలో రాళ్లు ఉంటే నడుము నొప్పి వస్తుంది. పక్కటెముకల కింద నొప్పి లేదా పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నొప్పి తరచుగా ఒక వైపున మాత్రమే వస్తుంది. 

 

పొత్తికడుపు నొప్పి పొత్తికడుపు నుంచి మన తొడల్లోకి, కాళ్ళలోకి కూడా వస్తుంది. ఈ విధంగా నొప్పి వస్తే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. కిడ్నీలో రాళ్లు ఉంటే తరచుగా మూత్రం వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళుతున్నట్లయితే కిడ్నీల విషయంలో వైద్యుడి వద్దకు వెళ్ళవలసిందే. 

 

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టులో భారీ ఉద్యోగాలు! మెట్రిక్ నుంచి డిగ్రీ అర్హతతో.. ఇక ఆలస్యం చేయొద్దు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కిడ్నీలలో రాళ్లు ఉంటే మూత్ర విసర్జన సమయంలో కూడా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి మంట అనుభూతి కూడా కలుగుతుంది. సరిగ్గా మూత్ర విసర్జన కాదు. తక్కువ మూత్రవిసర్జన చేసే పరిస్థితి ఉంటుంది. నిర్లక్ష్యం చేయొద్దు. కిడ్నీలో రాళ్లు మూత్రనాళాల ద్వారా బయటకు వెళుతున్నప్పుడు మూత్రంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. కిడ్నీలో రాళ్లతో కలిగే నొప్పి కారణంగా అసౌకర్యం కలుగుతుంది. కడుపులో వికారంగా, వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. 

 

ఇక కిడ్నీలో రాళ్లు పట్టించుకోకపోతే అవి ఇన్ఫెక్షన్ కు దారి తీసే అవకాశం ఉంది. చలి జ్వరం వచ్చే పరిస్థితులు కూడా లేకపోలేదు ఇక కిడ్నీలో రాళ్లతో సంబంధం ఉన్న ఇన్ఫెక్షన్ తో మూత్రం చెడు వాసన వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రంగా మారే ప్రమాదం ఉంటుంది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

   

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

  

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Health #Kidneys #KidneyStones #Symptoms